ఆందోల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌కు ఘన సన్మానం
మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 08 ఆందోల్: జిల్లా ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలానికి నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, తాలేల్మ సర్పంచ్ అశోక్ నేరడిగుంట గ్రామానికి అధ్యక్ష హోదాలో తొలిసారి విచ్చేసిన సందర్భంగా గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.
గొల్ల సుమిత్ర–అర్జున్ దంపతుల ముద్దుల కుమార్తె తొలి జన్మదిన వేడుకలకు అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ చందులత వీరమల్లప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్లోళ్ల రాజు పటేల్ ఆధ్వర్యంలో అశోక్‌ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దోడ్డోళ్ల కిష్టయ్య, ఎర్రారం అనిల్‌రెడ్డి, రాంసాన్‌పల్లి యువకిశోరం చింటు, పట్లోళ్ల రవీందర్, ఆశయ్య, ఎర్రోళ్ల జోగినాథ్, వరప్రసాద్, మణి, డప్పు శంకరయ్య, రిపోర్టర్లు నర్సమ్మ పాండరీ, మన్నే నాగయ్య, గున్నాల మధు, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని బోయిని శివకుమార్, జహీరాబాద్ నర్సింలు తదితరులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.