prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 9:20 am Digital Edition : PRAJA VANI

అవసరానికి ఏరుకుంటారు.. అవసరం తీరాక విసిరేస్తారు

*అవసరానికి ఏరుకుంటారు.. అవసరం తీరాక విసిరేస్తారు!*

ప్రజావాణి శ్రీకాంత్ ప్రత్యేక కథనం

ఏడాది పొడవునా పట్టించుకోని తంగేడు, జిల్లేడు.. బతుకమ్మ రాగానే దేవుళ్లైపోతాయి.
.అచ్చం మనుషుల లాగే.. అవసరం లేనప్పుడు ఎవరూ పలకరించరు!

బతుకమ్మ వస్తేనే పూలకు విలువ.. పని పడితేనే మనకు ఫోన్!

కొంతమంది బంధాలు కూడా తంగేడు పూల లాంటివే.. సీజన్ వస్తేనే గుర్తుకొస్తాం!

ఏడాదంతా ఎండకు ఎండి, వానకు తడిసే పూలను.. ఒక్కరోజు మాత్రం నెత్తిన పెట్టుకుంటారు!

మనం కూడా అంతే.. కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ చూడరు.. అవసరం అయితేనే వెతుక్కుంటూ వస్తారు!

తేడా ఒక్కటే అన్నారు.. అక్షర సత్యం!.

పూలను ఏరుకుంటారు.. మనుషులను వాడుకుంటారు.
పూలైనా దేవుడి దగ్గరకు చేరతాయి.. మనుషులైతే వాడుకొని వదిలేస్తారు
బతుకమ్మ పోయాక తంగేడు మళ్లీ అడవిలోనే.. పని అయిపోయాక మనం మళ్లీ ఒంటరిగానే.
ఇదే నేటి సమాజం నగ్న సత్యం.. అవసరాల బంధం.
నిజమైన బంధం ఎప్పుడూ ఏరుకోదు.. వాడుకోదు.. వెంటే ఉంటుంది.
సీజనల్ మనుషులకు దూరంగా ఉండడమే.. మనశ్శాంతికి మొదటి మెట్టు
పూలకున్న విలువ కూడా మనిషికి లేని రోజులివి!
బతుకమ్మ పూలను చూసి నేర్చుకోవాలి.. వాడుకునే వారిని గుర్తుపట్టాలి!
ఎందుకంటే.. పూలు ఏరుకుంటే పండుగ.. మనుషుల్ని వాడుకుంటే జీవితమే బతుకమ్మ!