prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 7:38 pm Digital Edition : PRAJA VANI

అర్ధరాత్రి మట్టి అక్రమ రవాణా

అర్ధరాత్రి మట్టి అక్రమ రవాణా…?

అక్రమానికి బరితెగింపు ఎక్కువ..?

ప్రజావాణి కథనాలకు గత ఎడాదిన్నరగా ఆగిన అక్రమ మట్టి రవాణా…?

నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి అక్టోబర్ 5 సోమవారం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని కట్టు కాసారం గ్రామంలో అక్రమ మట్టి వ్యాపారానికి కొందరు బడా బాబులు రంగం సిద్ధం చేసుకుని ఆదివారం అదునుగా అర్ధరాత్రి సుమారు 11:30 గంటల సమయంలో టిప్పర్ల ద్వారా ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేయటంతో గ్రహించిన గ్రామస్తులు కొందరు అడ్డగించి నిలదీసినట్లు సమాచారం. కాగా కొందరు నిర్వాహకులు లారీ డ్రైవర్లు అనుమతులు ఉన్నాయంటూ స్థానికులను నమ్మించి అక్రమంగా మట్టిని రవాణా చేసినట్లు సమాచారం. గత ఏడాది నర క్రితం మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో కట్టు కాసారం గుట్టల్లోగుట్టుగా కొనసాగుతున్న అక్రమ మట్టి రవాణా తెలంగాణ వయా ఆంధ్రకు తరలిపోతున్న మట్టి వరుస కథనాలకు నాటి మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులు స్పందించి సమగ్ర చర్యలు తీసుకోవడంతో అక్రమం సుమారు 18 నెలలు ఆగినట్లు స్థానికులు బహిరంగంగా అంటున్నారు. కాగా ఇటీవల కొందరు అదును చూసి మట్టి అక్రమ రవాణాను చేస్తున్నట్లు బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా గ్రామంలో మంచినీటి సరఫరా పైప్ లైన్లు ధ్వంసం అవుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మైనింగ్ రెవెన్యూ పోలీస్ యంత్రాంగాలు స్పందించి అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.