అమ్మవారికి మహా లింగార్చన.. భక్తిభావంతో పులకించిన భక్తులు

*అమ్మవారికి మహా లింగార్చన.. భక్తిభావంతో పులకించిన భక్తులు* *రాయికల్; అక్టోబర్ 12(ప్రజావాణి)* రాయికల్ పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని పురాతన పెద్ద పోచమ్మ దేవాలయం వద్ద సోమవారం భక్తి శ్రద్ధలు వెల్లివిరిసాయి.పట్టణంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సంఘమిత్ర శివాజీ యూత్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా లింగార్చన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ పుణ్యకార్యం కోసం ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ దేవస్థానం నుండి అర్చకుల బృందాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు.వేములవాడ అర్చకులు వేద పండితుల...