అమెరికాలో సద్దుల బతు
కమ్మ సందడి
*వేటా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ముఖ్య అతిథిగాఅజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి..*
తొర్రూరు
అక్టోబర్ 17(ప్రజావాణి)
అమెరికాలోసద్దుల బతుకమ్మ సందడి చేశారు.వేట సస్థ ఆధ్వర్యంలో ని కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రెస్నోలో ఉన్న శ్రీకృష్ణ బృందావన మందిరం (హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్రెస్నో) ఆధ్వర్యంలో అక్టోబర్ 16న బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, వేట ఫౌండర్ & చైర్మన్ హన్మాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గౌరీదేవిని పూజించారు.
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు వాటి గొప్పతనాన్ని పరిచయం చేసేలా ఇలాంటి వేడుకలను నిర్వహించడం విశేషం. ఈ వేడుకలు తెలుగు ప్రజల మధ్య ఐక్యతను, సాంస్కృతిక అనుబంధాన్ని చాటిచెప్పాయి.బతుకమ్మ సంబరాలు అమెరికాలో అంబరాన్ని అంటాయి.