prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 9:53 am Digital Edition : PRAJA VANI

అమెజాన్ సహకారంతో తాళ్లపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు

*అమెజాన్ సహకారంతో తాళ్లపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు*

*పాల్గొన్న ఎమ్మెల్యే కాల యాదయ్య గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి*

రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 30 ప్రజావాణి

షాబాద్ మండలం తాళ్లపల్లి గ్రామంలో అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, డైనింగ్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య తో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

నూతనంగా అభివృద్ధి చేసిన మౌలిక వసతులను ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు అమెజాన్ సంస్థ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా అభినందించారు. ఎమ్మెల్యే యాదయ్య, మధుసూదన్ రెడ్డి, మాట్లాడుతూ

గ్రామీణ ప్రాంతాల్లో విద్యా, మౌలిక వసతుల అభివృద్ధికి సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రిజినాల్ మన్నగర్ గాయత్రి, మన్నగెర్స్ కార్లన్ జాకెసన్ ,జోయేన్ అవినాష్ ,తాతజీ టి జి ఐ ఐ సి జిఎం జ్యోతి,సర్దార్ నగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్, ఎంఈఓ లక్ష్మణ్, స్థానిక సర్పంచ్ స్వాతి మాణిక్యం, సర్పంచులు ,టీం అమెజాన్ ,ఉపాధ్యాయులు,విద్యార్థులు,గ్రామస్తులు ,నాయకులు పాల్గొన్నారు.