prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 8:09 am Digital Edition : PRAJA VANI

అభ్యుదయ కాలనీలో పారిశుద్ధ్యానికి పెద్దపీట

అభ్యుదయ కాలనీలో పారిశుద్ధ్యానికి పెద్దపీట
– డ్రైనేజీల్లో చెత్త తొలగింపు.. గడ్డి మందు పిచికారీ.
– జిమ్మా జ్యోతి ఆధ్వర్యంలో ముమ్మర శుభ్రత.
– 12వ వార్డులో పరిశుభ్రతకు ప్రాధాన్యం.

గోవిందరావుపేట అక్టోబర్ 05 (ప్రజావాణి)

పస్రా అభ్యుదయ కాలనీ 12వ వార్డులో వార్డు సభ్యురాలు జిమ్మా జ్యోతి గారు పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు.
కాలనీలోని సైడ్ డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించే పనులను ముమ్మరంగా చేపట్టారు.
డ్రైనేజీలలో చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు.
వెంటనే స డ్రైనేజీలను పూర్తిగా శుభ్రం చేయించారు.
చెత్త తొలగించిన తర్వాత మళ్లీ గడ్డి, పిచ్చి మొక్కలు పెరగకుండా గడ్డి మందు పిచికారీ చేయిస్తున్నారు.
దీని వల్ల డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడి, మురుగునీరు సాఫీగా వెళ్లే అవకాశం ఏర్పడుతుంది.
జ్యోతి గారి చొరవతో కాలనీ పరిసరాలు పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా మారుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పారిశుద్ధ్యంపై ఆమె చూపిస్తున్న శ్రద్ధను కాలనీవాసులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
పారిశుద్ధ్య కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఆమె హామీ ఇచ్చారు.