అభిషేక్ మృతితో అయ్యగారిపల్లిలో విషాదం
అభిషేక్ మృతితో అయ్యగారిపల్లిలో విషాదం ప్రజావాణి,ఇనుగుర్తి: అందరితో కలివిడిగా ఉండే అభిషేక్(22) అకస్మాత్తుగా కన్నుమూయడంతో ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మలిశెట్టి నగేష్ సుధ దంపతుల కుమారుడు అభిషేక్ మూగవాడు. ప్రాథమిక స్థాయిలో బడికి వెళ్లి అనంతరం ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఉన్నట్లుండి శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో వారు గుండెపోటుకు గురై మృతి చెందవచ్చని భావిస్తున్నారు. మూగవాడైనప్పటికీ తల్లిదండ్రులు అల్లారం ముద్దుగా పెంచారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఎస్టి...