అభిషేక్ మృతితో అయ్యగారిపల్లిలో విషాదం
ప్రజావాణి,ఇనుగుర్తి: అందరితో కలివిడిగా ఉండే అభిషేక్(22) అకస్మాత్తుగా కన్నుమూయడంతో ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మలిశెట్టి నగేష్ సుధ దంపతుల కుమారుడు అభిషేక్ మూగవాడు. ప్రాథమిక స్థాయిలో బడికి వెళ్లి అనంతరం ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఉన్నట్లుండి శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో వారు గుండెపోటుకు గురై మృతి చెందవచ్చని భావిస్తున్నారు. మూగవాడైనప్పటికీ తల్లిదండ్రులు అల్లారం ముద్దుగా పెంచారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.
ఎస్టి కమిషన్ హుస్సేన్ నాయక్ నివాళి..
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ అభిషేక్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్న వయసులోనే అభిషేక్ కన్నుమూయడం పట్ల విచారణ వ్యక్తం చేశారు.
పాడెపట్టిన సర్పంచి శోభన్..
అభిషేక్ కన్నుమూసిన విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ మలిశెట్టి శోభన్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. బాల్యం నుంచి మూగవారినిగా ఉన్నప్పటికీ అందరితో కలివిడిగా ఉండేవాడని ఇంతలోనే కన్నుమూయడం బాధాకరమైన విచారం
వ్యక్తం చేశారు.అనంతరం మహాప్రస్థానం యాత్రలో పాల్గొని పాడె మోశారు.కొణతం వెంకన్న, మామిడి శోభన్ ,మలిశెట్టి శ్యామ్,సూర్య, బొల్లు సంపత్, వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.