అభివృద్ధి లోపాలున్న పిల్లల గుర్తింపునకు ప్రత్యేక వైద్య సేవలు

అభివృద్ధి లోపాలున్న పిల్లల గుర్తింపునకు ప్రత్యేక వైద్య సేవలు దండేపల్లి, సెప్టెంబర్ 3 (ప్రజావాణి): దండేపల్లి మండలంలోని గూడెం సెక్టార్ పరిధిలోని కొండాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ్ మాసంలో భాగంగా అభివృద్ధి లోపాలున్న పిల్లల గుర్తింపు కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 0 నుంచి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లల అభివృద్ధి మైలురాళ్లను నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లల్లో శారీరక, మానసిక, ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఉన్నట్లయితే వాటిని త్వరితగతిన గుర్తించేలా చర్యలు చేపట్టారు....