prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 1:08 pm Digital Edition : PRAJA VANI

అభివృద్ధి లోపాలున్న పిల్లల గుర్తింపునకు ప్రత్యేక వైద్య సేవలు

అభివృద్ధి లోపాలున్న పిల్లల గుర్తింపునకు ప్రత్యేక వైద్య సేవలు
దండేపల్లి, సెప్టెంబర్ 3 (ప్రజావాణి): దండేపల్లి మండలంలోని గూడెం సెక్టార్ పరిధిలోని కొండాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ్ మాసంలో భాగంగా అభివృద్ధి లోపాలున్న పిల్లల గుర్తింపు కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 0 నుంచి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లల అభివృద్ధి మైలురాళ్లను నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
ఈ సందర్భంగా పిల్లల్లో శారీరక, మానసిక, ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఉన్నట్లయితే వాటిని త్వరితగతిన గుర్తించేలా చర్యలు చేపట్టారు. లోపాలు ఉన్నట్లు గుర్తించిన పిల్లలకు తదుపరి వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఆస్పత్రులు, వైద్య నిపుణులకు ఉచితంగా రిఫర్ చేసే ప్రత్యేక సేవలను అందించారు.
పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మమత కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్, ఏఎన్‌ఎం రాజమణి, హెల్త్ అసిస్టెంట్ మేల్ రమణ, ఆశా కార్యకర్త మన్నె సుమలత, అంగన్‌వాడీ టీచర్లు గంధం భాగ్యమ్మ, సరిత, శ్యామల, మన్నె సువర్ణ, విజయదాసరి, ప్రసన్నకుమారి, ఆయా బండారి స్రవంతి, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.