అబ్దుల్ నగరంలో వీధి దీపం లేక చీకట్లో బొడ్డెమ్మ సంబరాలు – పట్టించుకోని అధికారులు
అబ్దుల్ నగరంలో వీధి దీపం లేక చీకట్లో బొడ్డెమ్మ సంబరాలు - పట్టించుకోని అధికారులు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07 (ప్రజావాణి): జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్ నగరం గ్రామంలో ప్రధాన రహదారి అయిన తరిగొప్పుల - హనుమకొండ ప్రధాన రహదారిపై రాముని సత్తయ్య కిరాణం దుకాణం వద్ద వీధి దీపం లేకపోవడంతో ఆ ప్రాంతం మొత్తం చీకటిలో మగ్గుతోంది. ప్రస్తుతం బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని ఆడపిల్లలు, మహిళలు సాయంత్రం వేళల్లో బొడ్డెమ్మ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకునే...