అనురాగ్ యూనివర్సిటీలో హెచ్‌ఎంఏ స్టూడెంట్ చాప్టర్ ప్రారంభం

ఘాట్ కేసర్, సెప్టెంబర్ 30 (ప్రజా వాణి): అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బీబీఏ, ఎంబీఏ విద్యార్థుల కోసం హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్‌ఎంఏ) స్టూడెంట్ చాప్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఎంఏ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి డా. వి. విష్ణు వందన మాట్లాడుతూ హెచ్‌ఎంఏ ప్రాధాన్యతతో పాటు విద్యార్థులు, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ కోసం సంస్థ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. హెచ్‌ఎంఏ అధ్యక్షుడు...