అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి వార్డు సభ్యుల ఆర్థిక సహాయం
కూసుమంచి, (ప్రజావాణి) అక్టోబర్ 7:
పోచారం గ్రామపంచాయతీ సిబ్బంది కానుగుల ఉపేందర్ తమ్ముడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ వార్డు సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. వార్డు సభ్యులంతా కలిసి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సలవాది గురుమూర్తి, ఉపసర్పంచ్ ముంగి వెంకన్న, పంచాయతీ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్టకాలంలో వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పోలంపల్లి కమలహాసన్, కుక్క మంగమ్మ, ఇరుగు గురులింగం, దుబ్బరి జ్యోతి, కోలపూడి రమేష్, కంభం జోష్ణ, కంభం పిచ్చయ్య, బత్తుల నరేష్, వల్లపు కవిత తదితరులు పాల్గొన్నారు.