prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 9:46 am Digital Edition : PRAJA VANI

అదృశ్యమైన యువకుని మృతదేహం చందనవెళ్లి చెరువుతో లభ్యం

*అదృశ్యమైన యువకుని మృతదేహం చందనవెళ్లి చెరువుతో లభ్యం*

*షాబాద్ అదృశ్యమైన యువకుడి మృతదేహం చందనవెళ్లి చెరువులో లభ్యమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది*

రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 30 ప్రజావాణి

పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… షాబాద్ మండలం రేగడిదోస్వాడ గ్రామానికి చెందిన చాకలి శ్రీకాంత్(22) గత వారం రోజులుగా కనిపించకుండా పోవడంలో కుటుంబ సభ్యులు షాబాద్ పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వారు బంధువుల వద్ద స్పేహితుల వద్ద ఎంత వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. బుధవారం షాబాద్ మండలం చందనవెళ్లి చెరువులో యువకుని మృతదేహం తేలిన సంఘటన తెలుసుకొని అక్కడికి వెళ్లి చూడగా మృతి చెందిన యువకుడు షాబాద్ మండలం తేవడిదోస్వాడ గ్రామానికి చెందిన చాకలి శ్రీకాంత్గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు చెరువులో దుృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుగుతున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శ్రీకాంత్ చెరువులోకి ఎలా వెళ్లాడు. ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేదా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.