prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 10:50 am Digital Edition : PRAJA VANI

అదనపు కట్నం కోసం వేధింపులు.. గర్భిణి మహిళ మృతి

అదనపు కట్నం కోసం వేధింపులు.. గర్భిణి మహిళ మృతి – ఏటూరునాగారంలో కేసు నమోదు

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.
రోహీర్ గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైం నం. 169/2026, సెక్షన్ 80 BNS కింద కేసు నమోదు చేశారు.ఫిర్యాదుదారు కుమార్తె సోదరి స్వర్ణలత, వయస్సు 25 సంవత్సరాలు మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్వర్ణలత 29.05.2025న అదే గ్రామానికి చెందిన సోదరి హరీష్ (28)ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
ప్రస్తుతం స్వర్ణలత నాలుగు నెలల గర్భిణిగా ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు.
అదనపు కట్నం మరియు భూమి కోసం భర్త A-1 హరీష్, అత్త A-2 వజ్రమ్మ, మామ A-3 లింగయ్య తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని తండ్రి ఆరోపించారు.
02.10.2026న ఉదయం సుమారు 9 గంటలకు స్వర్ణలత పురుగుమందు సేవించినట్లు సమాచారం అందింది.
వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఏటూరునాగారంలోని ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఉదయం 10 గంటలకు మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.