అడవి బిడ్డ అడుగేస్తే… అన్యాయానికి ఎదురుదెబ్బ
అడవి బిడ్డ అడుగేస్తే… అన్యాయానికి ఎదురుదెబ్బ! పోరాటమే ఊపిరిగా… మానవత్వమే ఆయుధంగా… ప్రజా సేవే పరమావధిగా… మన సీతక్క. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) అడవుల నిశ్శబ్దంలో అణగారిన గొంతుకై వినిపించిన స్వరం… అన్యాయపు సంకెళ్లను తెంచేందుకు ఎగసిన పోరాట జ్వాల… పేదవాడి కన్నీటిలో తన బాధను చూసుకున్న మానవతా హృదయం… ప్రజల గుండెల్లో నమ్మకమై నిలిచిన పేరు… ధనసరి అనసూయ సీతక్క! అడవి దారుల్లో మొదలైన అడుగు… అసెంబ్లీ గడప దాటిన అడుగైంది! ఆకలి బాధలను దగ్గరగా చూసిన చూపు… అభాగ్యుల బతుకులను...