*అట్టుకుతున్న సీఎంఆర్ బియ్యం వ్యవహారం…?
*గడుపులోగా బియ్యం అప్పగించని వారిపై చర్యలు ఏవి..?
*ఆ మండలంలో వ్యాపారుల లావాదేవీలపై
చర్చ రచ్చ..!
*లెక్కల్లో తేడాలు నివేదికలు.. సరే…?
*ఇంకా లెక్కకు రాని బియ్యం సంగతి ఏంటో…?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ బియ్యం వ్యవహారం మరో మారు సంచలనం కలిగిస్తోంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోని ఓ మండలంలో బియ్యం లావాదేవీలపై గత కొంతకాలంగా తీవ్ర చర్చలు సంప్రదింపులు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఓ వ్యాపారి లావాదేవీ వ్యవహారంపై కేసులు దాకా వ్యవహారం వెళ్లినట్లు తెలిసింది. కాగా గతంలో ఓ మిల్లులో దాడులు నిర్వహించి అర్ధరాత్రి వరకు లెక్కల్లో మునిగిన అధికార యంత్రాంగం ఇటీవల ఆ లెక్కలకు సంబంధించిన వివరాలు పొందుపరుస్తూ నివేదిక అందజేసినట్లు సమాచారం.
కాగా మరో మిల్లులో అక్రమంగా వరిపొట్టు నిండిన బస్తాలు తోపాటు ఓ బడ్డ భవనంలో మొక్కజొన్నల బస్తాలను లెక్కల్లో చూపించి ఆడిట్ వ్యవహారాన్ని సాఫీగా సాగించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ప్రజా పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన సివిల్ సప్లై అధికారులు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సిఎంఆర్ రైస్ టార్గెట్లు ఉన్న మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేస్తే అనేక విషయాలు వెలుగులోకి కొచ్చే అవకాశం ఉండదని సమాచారం. గతంలో ఈ ప్రాంతంలో విధులు నిర్వహించిన కొందరు అధికారులు తనిఖీలను నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నట్లు పలువురు నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఓ ప్రాంతంలో లెక్కకు దూరంగా ఉన్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో చిత్తశుద్ధిగా తనిఖీలు నిర్వహించి సిఎంఆర్ రైస్ అందించని మిల్లర్లపై రెవెన్యూ సివిల్ సప్లై చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
*మరికొన్ని సమగ్ర వివరాలతో పాటు అధికారుల వివరణలతో రేపటి కథనం…2లో వేచి చూడండి..!