prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 3:49 pm Digital Edition : PRAJA VANI

అజ్జమర్రి గ్రామంలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమం

*అజ్జమర్రి గ్రామంలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమం*

చిలిపిచేడు, అక్టోబర్ 22 మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి

చిలిపిచెడ్ మండలంలోని అజ్జమర్రి గ్రామంలో బుధవారం “ఖేత్ బచావో అభియాన్” (పొలాన్ని కాపాడుకుందాం) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం (KVK) తునికి శాస్త్రవేత్త శ్రీ రవికుమార్, మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్, ఏఈఓ వంశీ హాజరై రైతులకు అవగాహన కల్పించారు.

ఈసందర్భంగామాట్లాడుతూ… వరి కోత అనంతరం కొయ్యకాలను (వరి గడ్డిని) కాల్చడం వల్ల భూమి సారం తగ్గిపోతుందని, భూమిలోని సూక్ష్మ జీవులు చనిపోయి దిగుబడి తగ్గుతుందని తెలిపారు. కాబట్టి వరి కొయ్యకాలను కాల్చకుండా, కట్టలు కట్టే యంత్రాలను ఉపయోగించి, నేలలో కలియదున్నాలని సూచించారు.

అదేవిధంగా రసాయన ఎరువులను ప్రతి పంటకు సూచించిన మోతాదులో మాత్రమే వాడాలని, జీవన ఎరువులను ఉపయోగించి నేల ఆరోగ్యాన్ని కాపాడాలని వివరించారు. కలుపు మందులను, రసాయన ఎరువులను క్రమంగా తగ్గించి సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

ఎల్-నినో ప్రభావంతో రానున్న యాసంగిలో నీటి కొరత ఉండే అవకాశం ఉందని, నీటి లభ్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలైన జొన్న, కుసుమ, మినుములు, పెసర మరియు కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యశోద బిక్షపతి, కార్యదర్శి ప్రశాంతి, పరశురాం రెడ్డి, నగేష్ తదితర రైతులు పాల్గొన్నారు.