prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 5:24 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

అగ్నిప్రమాద బాధితులకు మద్దతు: రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి

ఎండపల్లి మండల కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన స్థానిక ఉపసర్పంచ్ దాసరి కళ్యాణి కొమురయ్య దంపతుల కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి పరామర్శించారు. తక్షణ సహాయంగా 10 వేల రూపాయలు అందజేసి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని భరోసా ఇచ్చారు.