prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 10:52 pm Digital Edition : PRAJA VANI

అక్షయపాత్రకు మధ్యాహ్న భోజనం అప్పగించడంపై వంట కార్మికుల ఆవేదన

*అక్షయపాత్రకు మధ్యాహ్న భోజనం అప్పగించడంపై వంట కార్మికుల ఆవేదన*

*ఉపాధి కోల్పోతున్నామని షాబాద్ ఎంఈఓ కార్యాలయంలో వినతి*

రంగారెడ్డి జిల్లా బ్యూరో అక్టోబర్ 1 ప్రజావాణి

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర సంస్థకు అప్పగించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని మధ్యాహ్న భోజనం వంట కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం, ఇంటిమేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల తమ కుటుంబాల జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

ఈ మేరకు గురువారం షాబాద్ ఎంఈఓ కార్యాలయ అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వంట కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరారు. సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న తమకు ఉపాధి కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.