prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 8:45 pm Digital Edition : PRAJA VANI

అక్రమ ఇసుకతోలకాలపై ఉక్కు పాదం మోపిన పోలీస్ సిబ్బంది

*అక్రమ ఇసుకతోలకాలపై ఉక్కు పాదం మోపిన పోలీస్ సిబ్బంది*

అనుమతి లేకుండా దొంగ చాటుగా ఇసుక తోలకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవు ఎస్సై బి సాయి కిషోర్ రెడ్డి

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై బి సాయి కిషోర్ రెడ్డి. తన సిబ్బందితో నమ్మదగిన సమాచారంపై గాడ్లగూడెం గ్రామ శివారులోని పెద్ద వగు ప్రాజెక్టు వాగు యందు అక్రమంగా ఇసుక తోలకాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకొని వారి నుండి నాలుగు ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్లు మరియు రెండు ఖాళీ ట్రాక్టర్లను మరియు ఒక ట్రాక్టర్ ఇంజన్ ను అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు,ఈ సందర్భంగా ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి,మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా మైనింగ్ అనుమతి లేకుండా ఇసుక తోలకాలు జరిపినట్లయితే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు,