అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
*అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు* *----ఆటపాటలతో మార్మోగిన పండగ ఉత్సవాలు* *రాయికల్; అక్టోబర్ 22(ప్రజావాణి)* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి.తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పూజించిన ఆడపడుచులు, చివరి రోజైన గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా గ్రామంలోని బతుకమ్మ ఘాట్ వద్దకు భారీగా చేరుకున్నారు. గునుగు, తంగేడు, బంతి, చేమంతి, కట్ల పూలతో రంగురంగుల బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు.బతుకమ్మల చుట్టూ...