అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు – ఆడపడుచుల నృత్యాలతో మార్మోగిన కుంటలు
*అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు - ఆడపడుచుల నృత్యాలతో మార్మోగిన కుంటలు** *తొమ్మిది రోజుల పండుగకు ఘన ముగింపు - బతుకమ్మల నిమజ్జనంతో పులకించిన మహిళలు* *పెద్దశంకరంపేట, అక్టోబర్ 18 (ప్రజావాణి ప్రతినిధి - బాలరాజు):* తెలంగాణ ఆడపడుచుల అతి పెద్ద పూల పండుగ అయిన బతుకమ్మ పండుగ ముగింపు వేడుకలు పెద్దశంకరంపేట మండల వ్యాప్తంగా శనివారం అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకున్న బతుకమ్మ పండుగకు సద్దుల బతుకమ్మతో ఘనంగా ముగింపు పలికారు. మండల...