prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 8:03 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

అంతా నా ఇష్టం

జ్యోతిబాపూలే విద్యా

విద్యార్థుల ధర్నాపై విమర్శలు

ప్రిన్సిపాల్ చేస్తున్నాడని తల్లిదండ్రుల ఆరోపణ

తొర్రూర్
సెప్టెంబర్ 4 (ప్రజావాణి)

తొర్రూర్ ఎం జె పి పాఠశాల ప్రిన్సిపాల్ ను బదిలీ చేయవద్దని విద్యార్థులు ఆందోళన చేసిన సంఘటన ఆదివారం తొర్రూర్ లో చోటుచేసుకుంది. తొర్రూర్ పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో గత వారం రోజులుగా వరుస ఘటనలు చేస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు తనిఖీలు చేసి ప్రిన్సిపాల్ ను మరొక చోటుకు బదిలీ చేసినట్లు తెలిసింది గత వారం రోజులుగా విద్యార్థులు చేత కట్టెలు కొట్టించడం చపాతీలు చేయించడం లాంటి పనులు చేస్తుండడంతో వారికి గాయాలయి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంఘటనలు ఉన్నాయి, దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బదిలీ అయినట్లు ఉత్తర్వులు రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల నుండి బయటకు రాకుండా వాచ్మెన్ కాపలా ఉన్న విద్యార్థులు ఎలా బయటికి వచ్చారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు తనకు సానుభూతి రావాలని ఐదు ఆరు తరగతుల విద్యార్థులు అక్కడ పనిచేస్తున్న వర్కర్ ను బయటికి పంపించి ధర్నా చేయించినట్లు స్థానికులు అంటున్నారు.ఏది ఏమైనా ఈ ఘటన జరగడంతో తల్లిదండ్రులు ఆందోళన లోపడ్డారు. ఈ పిల్లలు రోడ్డుపై వచ్చి ధర్నా చేసిన విషయంపై, ప్రిన్సిపాల్ యొక్క తీరుపై, సమగ్ర విచారణ జరిపి దానికి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.