అంతర్జాతీయ వేదికపై సత్యం గౌడ్ ప్రభంజనం
* వండర్ ఇండియా రికార్డ్స్’లో సువర్ణాక్షరాలతో లిఖితం
* రవీంద్రభారతి వేదికగా ప్రతిష్టాత్మక
* భారత్ గౌరవ్’ పురస్కార ప్రదానం
* హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రముఖులు సాహితీ లోకం
జమ్మికుంటఅక్టోబరు 6 (ప్రజావాణి)
హుజురాబాద్ నియోజకవర్గ గడ్డ మీద ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. సమాజ హితం, నిస్వార్థ సేవ, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణే శ్వాసగా జీవిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రజాకవి, మానవ విలువల పరిరక్షణ ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నాగుల సత్యం గౌడ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన సముచిత గౌరవం దక్కింది. ఆయన నిరంతర సామాజిక, ఆధ్యాత్మిక సేవలను గుర్తిస్తూ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ ‘వండర్ ఇండియా రికార్డ్స్’ తమ అధికారిక రికార్డుల పుస్తకంలో చోటు కల్పించడంతో పాటు అత్యున్నత ‘భారత్ గౌరవ్ పురస్కార్’తో ఘనంగా సత్కరించిందిహైదరాబాద్‌లోని లక్డీకాపూల్ రవీంద్రభారతి మెయిన్ హాల్ వేదికగా గాంధీ జయంతి, దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వైభవ సభలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు భారత్ వరల్డ్ రికార్డ్, ఏబీసీడీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కదరి వెంకటరమణ రావు సమక్షంలో ప్రముఖుల చేతుల మీదుగా సత్యం గౌడ్‌ను పట్టుశాలువాతో ఘనంగా సన్మానించారు. మెడలో ఐడెంటిటీ కార్డు వేసి కోటుపై అంతర్జాతీయ రికార్డు పతకాన్ని అలంకరించి ప్రశంసాపత్రంతో పాటు ప్రతిష్టాత్మక ‘భారత్ గౌరవ్’ అవార్డును అందజేసి నీరాజనాలు పలికారు
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రసంగిస్తూ రచనలు ఉపన్యాసాల ద్వారా సమాజంలో మానవీయ విలువల బీజాలు నాటుతూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతున్న సత్యం గౌడ్ సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. ఆయన నిస్వార్థ సమాజ సేవ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు
సన్మాన గ్రహీత డా నాగుల సత్యం గౌడ్ మాట్లాడుతూ సమాజ వికాసానికి అహింసా మార్గమే ప్రధాన రాజమార్గమని ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి లోకకళ్యాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని దేశ పురోగతికి బాటలు వేయాలనిసూచించారుకళాకారులనురచయితలను ప్రోత్సహిస్తున్న సంస్థల కృషిని అభినందించారుఈ కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం చైర్మన్ మందడి కృష్ణారెడ్డి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, సీఏ ప్రతినిధి బొగ్గారపు భాగ్యలక్ష్మి, ప్రధాన నృత్య గురువులు పి.రంగనాయకి వినయ్ రాథోడ్ అసలం ఆదర్శ ఫౌండేషన్ నిర్వాహకులు కుసుమ భోగరాజు తోట వందన పల్లి శిరీష, కీర్తనలతో పాటు పలువురు రచయితలు కళాకారులు సామాజికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హుజూరాబాద్ ముద్దుబిడ్డ అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపు సాధించడం పట్ల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు, సాహితీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనల వర్షం కురిపించారు.