అంజుమ్ సుల్తానా”కు అరుదైన గౌరవం

"అంజుమ్ సుల్తానా"కు అరుదైన గౌరవం.. విద్యారంగ సేవకు ప్రతిభా పురస్కారం.. ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ టీచర్ అంజుమ్ సుల్తానాకు హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలలో అరుదైన గౌరవం లభించింది.గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్,గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ,జయంతి పురస్కరించుకొని విద్యారంగంలో చేస్తున్న నిరుపమాన సేవలకు గాను అంజుమ్ సుల్తానా అబ్దుల్ ఖాదర్ జిలాని దంపతులకు ప్రతిభా అవార్డును అందజేసి ఘనంగా సన్మానించారు. *సమగ్ర కృషికి...