అంగన్ మిలాన్ సేవా కార్యక్రమం

మన ప్రజావాణి/ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్, రాజన్నపేటలో అంగన్ మిలాన్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పూర్ణిమ ఆధ్వర్యంలో అంగన్ మిలాన్ సేవలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి ఆహార పదార్థాలను అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని కార్యక్రమంలో సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ అవసరమైన వారికి...