*అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం*
అమీన్పూర్, అక్టోబర్ 3 (ప్రజావాణి): అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలకు ఘన సన్మానం నిర్వహించారు. అమీన్‌పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండల పరిధిలోని 19 అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయమ్మలను శాలువాలతో సత్కరించి నూతన వస్త్రాలు అందజేశారు. చిన్నారులకు పుస్తకాలు, స్నాక్స్, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజాసేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానన్నారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు పాల్గొన్నారు.