prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 8:20 am Digital Edition : PRAJA VANI

అంగడిపేట గ్రామంలో ఘనంగా విజయదశమి వేడుకలు

*అంగడిపేట గ్రామంలో ఘనంగా విజయదశమి వేడుకలు*

*బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోయపల్లి అనంత రాజు గౌడ్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో మంగళవారం విజయదశమి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి. గ్రామాల్లో ఇలాంటి సంప్రదాయ వేడుకలు ప్రజల్లో ఐక్యతను పెంచుతాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోయపల్లి అనంత రాజు గౌడ్, 4వ వార్డ్ కౌన్సిలర్ జెల్ల ధనమ్మ శ్రీను, 5వ వార్డ్ కౌన్సిలర్ కొండ్రెడ్డి మధు, చండూర్ పట్టణ బిఆర్ఎస్ కన్వీనర్ ఇరిగి రామన్న, నేలపట్ల యాదగిరి గౌడ్, పెద్దగోని బిక్షమయ్య గౌడ్, అయితగోని యాదయ్య గౌడ్, అనంత రమేష్ గౌడ్, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.