అంకుశాపూర్ అంబేద్కర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ ఏడవ డివిజన్ అంకుశాపూర్ అంబేద్కర్ కాలనీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు కప్పర్ గళ్ళ పోచయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘం సభ్యులు ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు ఆంజనేయులు,...