60 మందితో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం
60 మందితో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 28 కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. కూసుమంచి ఎంపీహెచ్‌సీ, ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. మొత్తం 60 మంది స్వచ్ఛంద రక్తదాతలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించి, వారికి రక్తదాన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, కుసుమంచి వైద్యాధికారి, కేజీబీవీ...