prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:15 pm Digital Edition : PRAJA VANI

60 మందితో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం

60 మందితో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం
ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 28
కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. కూసుమంచి ఎంపీహెచ్‌సీ, ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. మొత్తం 60 మంది స్వచ్ఛంద రక్తదాతలు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించి, వారికి రక్తదాన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, కుసుమంచి వైద్యాధికారి, కేజీబీవీ ప్రిన్సిపాల్, వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.
ఖమ్మం జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ సీఏఎస్, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలోని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్త సేకరణలో సహకరించారు. కుసుమంచి పీహెచ్‌సీ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమం సజావుగా సాగింది. రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు సహాయం అందుతుందని వైద్యులు తెలిపారు. ప్రజల్లో రక్తదానంపై మరింత అవగాహన కల్పించేందుకు భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.