prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 4:28 pm Digital Edition : PRAJA VANI

50 మందిబీసీహాస్టల్‌ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ 

50 మందిబీసీహాస్టల్‌ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ

 

* కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్

 

జమ్మికుంట సెప్టెంబర్ 8 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలోని బీసీ హాస్టల్‌ను 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ సందర్శించి విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న అల్పాహారం భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారి చదువుకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారుఅనంతరం హాస్టల్‌లోని 50 మంది విద్యార్థులకు భోజనం చేసేందుకు ప్లేట్లను పంపిణీ చేశారుఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ మాట్లాడుతూ తమ హౌసింగ్ బోర్డు ప్రజల ఆశీస్సులతో విద్యార్థి దశ నుంచే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ వంతుగా పేద ప్రజలకు విద్యార్థులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధులుగా సేవలందించే అవకాశం లభించిందని భవిష్యత్తులో కూడా ప్రజలకు విద్యార్థులకు అండగా ఉంటామని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో బీసీ హాస్టల్ వార్డెన్ నరేష్ స్వరాజ్ రాజేష్ ఇమ్రాన్ తదితరులు హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు