prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 8:43 pm Digital Edition : NARESH Nayak RAMAYAMPET

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: బీజేపీ
అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. ముందస్తు అరెస్టులు సిగ్గుచేటు
టేక్మల్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ శాంతియుతంగా చేపట్టనున్న ఆందోళనను అడ్డుకునేందుకు టేక్మల్ మండల బీజేపీ నాయకులను ప్రభుత్వం ముందస్తుగా అరెస్టు చేయడం సిగ్గుచేటని బీజేపీ గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యుడు రెడ్యా నాయక్ తీవ్రంగా ఖండించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, సమస్యపై ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
ప్రజా సమస్యలపై శాంతియుతంగా పోరాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో బీజేపీ ఉద్యమాన్ని అణచివేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని రెడ్యా నాయక్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్రమ అరెస్టులు నిలిపివేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన