స్కాలర్‌షిప్ బకాయిలపై విద్యార్థుల ఆగ్రహం బిక్కనూరులో టీజీవీపీ ధర్నా.. రూ.15 వేల కోట్ల పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ “విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి”.. స్పందించకుంటే అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరిక బిక్కనూర్, సెప్టెంబర్ 1 ( విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో బిక్కనూర్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు....