285 గ్రాముల గంజాయి ప్యాకెట్ల స్వాధీనం….నారపల్లిలో 95 ప్యాకెట్లు పట్టుకున్న మల్కాజ్‌గిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 29 (ప్రజావాణి): ఘట్‌కేసర్ పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి మల్కాజ్‌గిరి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 285 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాయి టీచర్స్ కాలనీ, నారపల్లిలో మల్కాజ్‌గిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం ట్రైనీ ఏఈఎస్ ముస్తఫా సిద్దిక్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టగా షంషేర్ అలీ ఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్ వద్ద 95 గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. విచారణలో మహారాష్ట్రలోని పర్బణి నుంచి గంజాయిని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ప్యాకెట్‌ను మూడు గ్రాముల చొప్పున...