శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం

మేడ్చల్, సెప్టెంబర్ 23 ప్రజావాణి: మేడ్చల్ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీలో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద బుధవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ రమేష్, మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చాపరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు...