మేడ్చల్, సెప్టెంబర్ 23 ప్రజావాణి: మేడ్చల్ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీలో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద బుధవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ రమేష్, మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చాపరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు, కాలనీ వాసుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన భక్తులు, స్థానికులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో కాంతి నర్సింగ్ రావు, సతీష్ గౌడ్, నవీన్, నరేష్, అనిల్, కొండ, సాయి, తరుణ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.