*పోకిరిలకు అడ్డాగా ఎర్ర చెరువు కట్ట*

*పోకిరిలకు అడ్డాగా ఎర్ర చెరువు కట్ట* *విద్యుత్ దీపాలు లేక అంధకారం.. గుబురు చెట్ల మధ్య అసాంఘిక కార్యకలాపాలు* *పోలీసులు రోజూ పెట్రోలింగ్ నిర్వహించి మహిళలు, వాహనదారులకు భద్రత కల్పించాలని డిమాండ్* మేడ్చల్, సెప్టెంబర్ 23: మేడ్చల్‌లోని ఎర్ర చెరువు కట్ట రోడ్డు రాత్రివేళల్లో అంధకారంలో ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట చుట్టూ గుబురుగా చెట్లు పెరగడంతో పాటు ఒక్క విద్యుత్ దీపం కూడా లేకపోవడంతో ఈ ప్రాంతం కొందరు ఆకతాయిలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో...