prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 1:41 pm Digital Edition : PRAJA VANI

17 వార్డు ప్రజలంతా చంద్ర శేఖర్ త్యాడి ను బలపరుస్తున్నాం..

17 వార్డు ప్రజలంతా చంద్ర శేఖర్ త్యాడి ను బలపరుస్తున్నాం..

నూతన గృహ ప్రవేశానికి పిలిచి తప్పుడు ప్రచారం తగదు.

11వ వార్డు పుర ప్రజలు

పలాస, ప్రజావాణి ప్రతినిధి

పలాస మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డు ప్రజలంతా చంద్ర శేఖర్ త్యాడి వెనుక ఉన్నారని ఆ వార్డు ప్రజలు తెలిపారు.

అబద్ధంతో రాజకీయ పునాది వేయలేరని, తమను కేవలం నూతన ఇంటికి ఆహ్వానించి రాజకీయ రంగు వేయడం సరికాదని 11వ వార్డు ప్రజలు అన్నారు. ఇటీవల 11వ వార్డుకు చెందిన నిత్యానంద పండా అనే వ్యక్తి 11వ వార్డు పుర ప్రజలందరిని నూతన ఇంటి నిర్మాణముతో విందు భోజనము పేరిట ఆహ్వానం పలికి, అనంతరము వివిధ పత్రికల్లో రాజకీయ సమ్మేళమని పత్రికల్లో పబ్లిసిటీ చేయడము పై వాళ్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తామంతా రానున్న ఎన్నికల్లో 11వ వార్డు ( ప్రస్తుతం 17వ వార్డు) పుర ప్రజలంతా చంద్రశేఖర్ త్యాడి వెనకే ఉన్నామని, తాము ఈసారి అతడి ని గెలిపించి, కౌన్సిల్ కు పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. ఇది కేవలం నూతన ఇంటికి ఆహ్వానమని ఆ విందుకు వెళ్లడం తప్ప వేరే ఉద్దేశం లేదని వారంతా కరాకండిగా తెలిపారు. ఇటువంటి తప్పుడు విధానాలతో అనవసరమైన కలహాలను 11వ వార్డులో సృష్టించ వద్దని, తామంతా త్యాడి వైపే ఉన్నట్లు ముక్తకంఠంగా తెలిపారు. వివరాలు తెలిపున వారిలో పూజారి రావినారాయణ పండా, సంతోష్ పండా, మనోజ్ పండా, ప్రసాద్ పాత్రో, దేవేంద్రో త్యాడి, ఓంకార్ త్యాడి, సంతోష్ త్యాడి తో పాటు అధిక సంఖ్యలో వార్డు ప్రజలు ఉన్నారు.