prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 4:46 pm Digital Edition : PRAJA VANI

16వ వార్డులో అర్హులకు చేయూత పెన్షన్లు

16వ వార్డులో అర్హులకు చేయూత పెన్షన్లు

జోగిపేట, సెప్టెంబర్ 23: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి

అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు వితంతు, వికలాంగ, వృద్ధాప్య పెన్షన్ల మంజూరు పత్రాలను వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల శ్రీనివాస్ అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే తన బాధ్యత అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
పెన్షన్ మంజూరు పొందిన లబ్ధిదారులు:
రుమాండ్ల చరిత, మహాజబీన్, రోషిని దేవి, బిట్టు మంజు, చుట్టకుల సుభాష్, గౌడెల్లి ఉమారాణి, ఎం.డి. పాషా, అవుసలి పూజ, శబనా బేగం, సులుగంటి ఝాన్సీ, కన్నా సంగీత, చెర్ల ప్రభావతి.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని కౌన్సిలర్ పట్లోళ్ల శ్రీనివాస్ తెలిపారు.