మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం సీపీఐ నాయకులు

ఘట్కేసర్‌, సెప్టెంబర్‌ 13 (ప్రజావాణి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సీపీఐ ఘట్కేసర్‌ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్‌, సీపీఐ సీనియర్‌ నాయకులు కల్లూరి జైచంద్ర పిలుపునిచ్చారు. పోచారం పరిధిలోని ఆర్‌జీకే కాలనీ, కేఎల్‌ మహేంద్రనగర్‌, వికలాంగుల కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి కూడా మనలను కాపాడుతుందని అన్నారు. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలు, రసాయన రంగుల వినియోగం...