బొడుప్పల్‌లో 500 మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ…పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే పూజించాలి…భక్తులకు అవగాహన కల్పిస్తున్న శ్రీ మాత నిమిషాంబికా దేవి ట్రస్ట్

బొడుప్పల్‌, సెప్టెంబర్‌ 13 (ప్రజావాణి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని భక్తులకు అవగాహన కల్పిస్తూ శ్రీ మాత నిమిషాంబికా దేవి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 500 మట్టి గణపతి విగ్రహాలను ఆదివారం భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. హెచ్‌ఎండీఏ సహకారంతో శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం, హంపి పీఠం, నకాష్‌ సంఘం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించడం...