జగన్ కుటుంబానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆర్థిక సాయం.. గ్రామస్తుల ప్రశంసలు

ఇటీవల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఎండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మానవత్వంతో రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. అలాగే జగన్ భార్యకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తానని, పిల్లల చదువుకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కోసం అప్పులు చేసి చనిపోయిన జగన్ కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా స్పందించిన మంత్రికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.