ఆర్య వైశ్య ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన….ఉప్పల్‌ భగాయత్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన….కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, ఉపాధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్‌

ఉప్పల్‌  సెప్టెంబర్‌ 13 (ప్రజావాణి): ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్య వైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌తో కలిసి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సమాజం కోసం నిర్మించనున్న ఆత్మగౌరవ భవనం ప్రాధాన్యతను నాయకులు వివరించారు. సమాజ అభివృద్ధి, సంక్షేమానికి భవనం వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆర్య వైశ్యుల చిరకాల ఆకాంక్ష...