prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 7:17 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఆర్య వైశ్య ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన….ఉప్పల్‌ భగాయత్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన….కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, ఉపాధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్‌

ఉప్పల్‌  సెప్టెంబర్‌ 13 (ప్రజావాణి): ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్య వైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌తో కలిసి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆర్య వైశ్య సమాజం కోసం నిర్మించనున్న ఆత్మగౌరవ భవనం ప్రాధాన్యతను నాయకులు వివరించారు. సమాజ అభివృద్ధి, సంక్షేమానికి భవనం వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆర్య వైశ్యుల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమైన విషయమని తెలిపారు.

ఆత్మగౌరవ భవనం భవిష్యత్‌లో ఆర్య వైశ్యుల సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.