prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 1:05 pm Digital Edition : PRAJA VANI

14వ వార్డులో ఎస్‌ఐఆర్‌ మార్పులు, చేర్పుల స్వీకరణ

*14వ వార్డులో ఎస్‌ఐఆర్‌ మార్పులు, చేర్పుల స్వీకరణ*

 

మన సమగ్ర ప్రజావాణి (జోగిపేట) సెప్టెంబర్ 11

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

 

 

జోగిపేట మున్సిపల్ పరిధిలోని సీపీఎస్‌ పాఠశాల ప్రాంగణంలో 14వ వార్డుకు సంబంధించిన ఎస్‌ఐఆర్‌ (SIR) మార్పులు, చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది.

14వ వార్డుకు చెందిన ప్రజల నుంచి సరైన పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లను మున్సిపల్ సిబ్బంది స్వీకరిస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వారికి అవసరమైన పత్రాలను సమకూర్చుకునేలా సూచనలు అందిస్తూ వివరాలను పరిశీలిస్తున్నారు.

ఈ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షిస్తూ, ప్రజల నుంచి దరఖాస్తులు మరియు సంబంధిత పత్రాలను స్వీకరిస్తున్నారు. 14వ వార్డు ప్రజలు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన ఆధారాలతో ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.