బద్వేల్లో ‘ఆట’కు అడ్డంకులు.. మైదానం లేక క్రీడాకారుల అగచాట్లు!
ప్రతిభ ఉన్నా రాణించలేకపోతున్న యువత క్రికెట్ ఆడేందుకు పక్క ఊర్లకు పరుగులు.. వేల రూపాయల ఖర్చు సమగ్ర క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తి బద్వేల్,సెప్టెంబర్ 13 ప్రజావాణి నియోజకవర్గమైన బద్వేల్లో క్రీడాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నియోజకవర్గ కేంద్రంలో సరైన క్రీడామైదానం (ప్లేగ్రౌండ్) లేదా అధునాతన స్టేడియం లేకపోవడంతో వేలాది మంది యువతీ యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నప్పటికీ, వారికి కనీస వసతులు కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారనే విమర్శలు...