prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 10:03 am Digital Edition : PRAJA VANI

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను  జరుపుకోవాలి…..షాబాద్ సీఐ  శ్రీ లక్ష్మారెడ్డి వెల్లడి

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను  జరుపుకోవాలి……
……. షాబాద్ శ్రీ లక్ష్మారెడ్డి వెల్లడి….,
రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 13 ప్రజావాణి. గణేష్ ఉత్సవాల నవరాత్రులను పురస్కరించుకొని షాబాద్ మండల కేంద్రంలోని ఆయా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు షాబాద్ పోలీసులు గణేష్ ఉత్సవ కమిటీలకు సూచనలు ఇచ్చారు. శనివారం షాబాద్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో షాబాద్ మండల లోని వివిధ గ్రామాలకు చెందిన గణేష్ విగ్రహాల నిర్వాహకులు. మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాబాద్ సిఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కనెక్షన్లు.సౌండ్ సిస్టం.వినియోగం. శాంతిభద్రతల చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్ వినియోగించరాదన్నారు. డీజే లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిమజ్జనం సందర్భంగా పోలీసులు సూచించిన మార్గాల సమయపాలన పాటించాలని కోరారు. మద్యం పేకాట అసభ్య కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. పోలీస్ మీడియాలో వదంతులు వివాదస్పద పోస్టులు చేయరాదన్నారు. ఉత్సవాల నిర్వాకులు షాబాద్ పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని షాబాద్ సీఐ  లక్ష్మారెడ్డి సూచించారు.